Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై విచారణకు ఏకసభ్య కమిషన్‌

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో 8 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ గురువారం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు.ఈ నెల 3వతేదీన లఖింపూర్‌ ఖేరీలో జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా 8మంది మరణించారు. రోడ్డుపై ప్రదర్శనగా వెళుతున్న వాహనాలు వేగంగా దూసుకెళ్లిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ప్రమేయం ఉండటంతో ఈ కేసుపై రాజకీయ వివాదం ఏర్పడిరది. ఈ కేసును గురువారం విచారించనుంది.ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ హడావుడిగా గురువారం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు.ఈ ఏకసభ్య కమిషన్‌ రెండు నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని గవర్నర్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img