Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

లఖీంపూర్‌కు వెళ్లేందుకు రాహుల్‌గాంధీ, ప్రియాంకకు అనుమతి

ఎట్టకేలకు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ లఖీంపూర్‌ పర్యటనకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లఖింపూర్‌ ఖేరి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంతో రాహుల్‌ బైఠాయింపు నిరసన విరమించారు.అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి, సొంత వాహనంలో అక్కడ్నించి బయలుదేరారు.లఖింపూర్‌లో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, అక్కడికి ఎవరిని అనుమతించడం లేదని అంతకుముందు యూపీ పోలీసులు తెలిపారు. అయితే తనతో పాటు చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌ , పంజాబ్‌ సీఎం చన్నీ మాత్రమే వస్తున్నారని , తమకు 144 సెక్షన్‌ వర్తించదని రాహుల్‌ తెలిపారు. చివరిక్షణంలో రాహుల్‌తో పాటు ప్రియాంకకు కూడా అనుమతి ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img