Friday, March 24, 2023
Friday, March 24, 2023

లాలూ యాదవ్ కుటుంబానికి బిగ్ రిలీఫ్.. రబ్రీతో సహా నిందితులందరికీ బెయిల్..

ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఉపశమనం లభించింది. బుధవారం రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతికి ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ లభించింది. రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుపై లాలూ యాదవ్, మిసా భారతి, రబ్రీ దేవిలకు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29న జరగనుంది. రైల్వే ఉద్యోగాలకు బదులుగా భూమికి సంబంధించిన కేసులో ముగ్గురు నిందితులు మంగళవారం (మార్చి 15) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. విచారణ ప్రారంభం కాగానే, నిందితులందరూ చేతులు పైకెత్తి కోర్టులో న్యాయమూర్తి ఎదుట తమ హాజరును నమోదు చేసుకున్నారు.

కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం లాలూ యాదవ్, మిసా భారతి, రబ్రీ దేవి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురి పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, నిందితులందరికీ రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి భూములు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది మే 18న లాలూ యాదవ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.అంతకుముందు మార్చి 6న పాట్నాలోని రబ్రీదేవి నివాసానికి చేరుకున్న సీబీఐ మాజీ సీఎంను విచారించింది. మరుసటి రోజు మార్చి 7న ఢిల్లీలోని మిసా భారతి నివాసానికి సీబీఐ బృందం చేరుకుంది. ఇక్కడ కుంభకోణం కేసులో లాలూ యాదవ్‌ను సీబీఐ విచారించింది.మూడు రోజుల విచారణ తర్వాత, లాలూ యాదవ్, తేజస్వి యాదవ్, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులపై జుణ బృందం దాదాపు 15 ప్రదేశాలపై దాడి చేసింది. 600 కోట్ల ఆర్థిక నేరం జరిగినట్లు విచారణలో తేలిందని ఈడీ పేర్కొంది. కోటి నగదు, 1900 డాలర్లు, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img