Monday, March 20, 2023
Monday, March 20, 2023

లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీలో కరోనా కలకలం

84 మంది ఐఎఎస్‌ ట్రైనీలకు పాజిటివ్‌
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ముస్సోరిలో ఉన్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీలో కరోనా కలకలం రేగింది. అకాడమీలో 84 మంది ఐఎఎస్‌ ట్రైనీలు, అధ్యాపకులకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ముస్సోరి అకాడమీని కొవిడ్‌ కంటైన్మెంట్‌ జోన్‌ గా ప్రకటించారు. కొవిడ్‌ బాధితులను ముస్సోరి అకాడమీలోనే క్వారంటైన్‌ చేశారు.అకాడమీలో ట్రైనీలందరికీ కరోనా పరీక్షలు చేశారు. ముస్సోరి అకాడమీలో కరోనా వ్యాప్తికి కారణాలపై వైద్యుల బృందం ఆరా తీస్తోంది. వైద్యబృందాలను అకాడమీకి రప్పించారు.గడచిన 24 గంటల్లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో 4,482 మందికి కరోనా సోకింది. కరోనా వల్ల ఆరుగురు మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img