Monday, October 3, 2022
Monday, October 3, 2022

లుఫ్తాన్సా విమానాల రద్దు..దిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల నిరసన

పైలట్ల ఒక్క రోజు మెరుపు సమ్మెతో జర్మనీకి విమానయాన సంస్థ లుఫ్తాన్సా ప్రపంచవ్యాప్తంగా 800 విమానాలను రద్దుచేసింది. దీంతో ఆ విమానాల్లో ముందుగా టిక్కెట్లు బుక్‌ చేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ విమాన చార్జీలను రిఫండ్‌ చేయాలని కోరుతూ దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులు నిరసనలు చేపట్టారు. దిల్లీ నుంచి జర్మనీకి వెళ్లాల్సిన రెండు విమానాలు రద్దుకావడంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 700 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం అర్ధరాత్రి విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకుంది.నిరసనకు దిగిన ప్రయాణీకులకు ఢల్లీి పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.ఎయిర్‌లైన్‌ కంపెనీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతుందని అధికారులు వారికి హామీ ఇచ్చారు. ఢల్లీి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌, మునిచ్‌ వెళ్లాల్సిన ప్రయాణీకులు చెకింగ్‌ ఇన్‌ ఏరియా వెలుపలి ఎగ్జిట్‌ గేట్లు వద్ద ధర్నా చేపట్టారు. కాగా పైలట్ల సమాఖ్య ఒక రోజు సమ్మెకు దిగడంతో శుక్రవారం 800 విమానాలను రద్దు చేసినట్టు దీంతో 1,30,000 మంది ప్రయాణీకులపై ప్రభావం పడుతుందని లుఫ్తాన్సా పేర్కొంది. ప్రయాణీకులతో పాటు కార్గో సేవలపైనా పైలట్ల సమ్మె ప్రభావం పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img