Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

లోయలోపడ్డ బస్సు..ఒకరి మృతి.. 64 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని ఉధంపూర్‌ జిల్లాలో ఇవాళ ఉదయం ప్రైవేటు ప్యాసింజర్‌ బస్సు మౌంగ్రీ ఖోర్‌ గలీ నుంచి ఉధంపూర్‌ పట్టణానికి వెళ్తుండగా క్రిమాచి-మాన్సర్‌ ఏరియాలో ప్రమాదవశాత్తు లోయలో పడిరది. ప్రమాద సమయంలో బస్సులో ఎక్కువగా స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఓ మూల మలుపు వద్ద డ్రైవర్‌ బస్సుపై కంట్రోల్‌ కోల్పోవడంతో.. బస్సు మలుపు తిరగకుండా ఎదురుగా ఉన్న లోయలో పడినట్లు తెలుస్తోంది. నలభై అడుగుల లోతున్న లోయలోకి పల్టీలు కొడుతూ వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు సహా మొత్తం 64 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ మితిమీరిన వేగంతో బస్సు నడపడంవల్లే ప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img