Friday, September 22, 2023
Friday, September 22, 2023

వందమంది రైతులపై దేశద్రోహం కేసు


బీజేపీ నేత కారుపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వందమంది రైతులపై హర్యానా పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న సిర్సా జిల్లాలో ఆందోళన చేస్తున్న రైతులు డిప్యూటీ స్పీకర్‌ రణ్‌బీర్‌ గంగ్వా కారుపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దేశద్రోహం కేసుతోపాటు ‘హత్యాయత్నం’ కేసు కూడా రైతులపై నమోదు చేశారు.కాగా సెక్షన్‌ 124-ఎను వలస చట్టంగా అభివర్ణించిన సుప్రీంకోర్టు..బ్రిటీష్‌ కాలం నాటి ఈ చట్టం అవసరమా అని ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే రైతులపై ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదవ్వడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img