సెప్టెంబర్ 25న భారత్ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది.కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు బంద్‌కు పిలుపు ఇచ్చామని ఎస్కేఎం వెల్లడిరచింది. సింఘు బోర్డర్లో విలేకరుల సమావేశంలో ఎస్కేఎం ప్రతినిధి అశీష్ మిట్టల్ మాట్లాడుతూ, గత ఏడాది ఇదే రోజున తాము దేశవ్యాప్త బంద్‌ను జరిపామని గుర్తు చేశారు.కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో గత ఏడాది జరిగిన బంద్ కంటే ఈసారి భారత్ బంద్ మరింత విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.