Monday, September 26, 2022
Monday, September 26, 2022

వచ్చే రెండు,మూడు రోజుల్లో భారీవర్షాలు

ఐఎండీ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో వచ్చే రెండు,మూడు రోజుల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం వెల్లడిరచింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ ఘడ్‌, విదర్భ, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌ ప్రాంతాల్లో వచ్చే రెండు మూడు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా విడుదల చేసిన వెదర్‌ బులెటినలో పేర్కొంది. దేశ రాజధాని ఢల్లీితోపాటు తూర్పు,ఈశాన్య ప్రాంతాల్లోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. వచ్చే రెండు,మూడు రోజుల్లో భారీవర్షాలు…ఐఎండీ హెచ్చరికఅసోం, మేఘాలయ, మణిపూర్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.మధ్యప్రదేశ్‌, హర్యానా, చంఢీఘడ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img