Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

వానరాల నుంచి పోలీస్‌స్టేషన్‌కు అవే కాపలా..!..కేరళ పోలీసుల ఆలోచన అదుర్స్‌

పోలీసులు సాధారణంగా ప్రజలకు రక్షణగా ఉంటారు. అయితే కేరళలో ఓ పోలీస్‌ స్టేషన్‌కే రక్షణ కావాల్సి వచ్చింది. దాంతో పోలీసులు పాములను తమ కాపాలాదారులుగా పెట్టుకున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. చట్టాన్ని అమలు చేసే వారికే రబ్బరు పాములు రక్షకులుగా మారాయి. పోలీస్‌ స్టేషన్‌ను కాపాడుతున్నాయి. హై-రేంజ్‌ ఇడుక్కిలోని దట్టమైన అడవిలో ఉండే ఓ పోలీస్‌ స్టేషన్‌కి కోతులు బెడద ఎక్కువగా ఉంది. వాటితో పోలీసులు విసిగిపోయారు. ఎంత తరిమికొట్టినా.. మళ్లీ మళ్లీ వచ్చి ఇబ్బంది పెడుతుండేవి. దాంతో కోతుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారు విచిత్రమైన ఆలోచన చేశారు. కోతులను భయపట్టేందుకు రబ్బరు పాములను పెడుతున్నారు. కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉన్న కుంబుమెట్టు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ కోతులను భయపెట్టేందుకు రబ్బరు పాములను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రిక్‌ చాలా విజయవంతమైంది. అచ్చం పాముల్లా ఉండే రబ్బరు పాములను తయారు చేయించి.. వాటిని తెచ్చి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని చెట్ల కొమ్మలపై, గ్రిల్స్‌పై పెడుతున్నారు. దాంతో అవి నిజమైన పాములనుకుని కోతులు ఆ చుట్టుపక్కలకే వెళ్లడం మానేశాయి. కోతుల నుంచి పోలీసులకు ఉపశమనం లభించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img