న్యూదిల్లీ: గాలి నాణ్యతపై ఏర్పాటు చేసిన కమిటీపై సుప్రీంకోర్టు మండిపడిరది. దిల్లీలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు, వాయు కాలుష్యాన్ని అరికట్టేం దుకు తగిన చర్యలు తీసుకోవ డంలో విఫలమైందని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)… గాలి నాణ్యతను పర్యవేక్షించడా నికి ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయలేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఏజీ మసీప్‌ాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. చట్టాన్ని పూర్తిగా మరిచారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా తెలియజేయాలని కేంద్ర ప్యానెల్‌ను ప్రశ్నించింది. అంతా గాలికి వదిలేశారని మండిపడిరది. ‘చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా… మీరు తీసుకున్న ఒక్క చర్యను మాకు వివరించండి… వాయు కాలుష్య చట్టంలోని సెక్షన్ 12ఏవై ఏ ఆదేశాలను ప్రయోగించారు. అన్నింటినీ గాలికి వదిలేశారు. ఎన్సీఆర్ పరిధి ప్రాంతాల్లో ఏం చేశారో చూపించలేదు’ అని జస్టిస్ ఓకా పేర్కొన్నారు. అయితే సీఏక్యూఎం ఎలాంటి చర్య తీసుకోలేదని తాము చెప్పడం లేదు కానీ ఆశించిన విధంగా పని చేయలేదని బెంచ్ పేర్కొంది. మూడు నెలలకు ఒకసారి తాము సమావేశం అవుతున్నామని సీఏక్యూఎం చైర్మన్ రాజేశ్ వర్మ తెలియజేయగా… సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అంత సమయం సరిపోతుందా… మీరు తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయా… పంట వ్యర్ధాలు తగులబెట్టే సంఘటనలు తగ్గుముఖం పడుతున్నాయా అని కోర్టు ప్రశ్నించింది. తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా చైర్మన్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అయితే కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి… రెండు వారాల క్రితమే చైర్మన్ చేరారని తెలిపారు. పంజాబ్, హర్యానా అధికారులు, పొల్యూషన్ బోర్డుతో సమావేశాలు జరిగాయని, వారి ప్రధాన కార్యదర్శులకు హెచ్చరికలు జారీ చేశారని చైర్మన్ తెలిపారు. అనంతరం కాలుష్య నియంత్రణకు ఏర్పాటు చేసిన సమావేశాల వివరాలు, చర్యలను తమ ముందుకు తీసుకురావాలని చెబుతూ విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది ధర్మాసనం.