Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

వాళ్లు చేసిన నేరమేంటి?

తీస్తా సీతల్వాడ్‌, జుబేర్‌ అరెస్ట్‌లపై మమతా బెనర్జీ ఫైర్‌
ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌, ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబేర్‌ అరెస్టుపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్రం చర్యలను దుయ్యబట్టారు. బీజేపీ సోషల్‌ మీడియా మొత్తం తప్పుడు సమాచారంతో నిండి ఉంటుందని, ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. బూటకపు వీడియోలతో అబద్ధాలను ప్రచారం చేస్తారని విమర్శించారు. బీజేపీ నేతలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినప్పుడు, ఇతరులను అవమానించినప్పుడు మౌనంగా ఉంటారని, కానీ నిజం మాట్లాడే వారిని అరెస్టులు చేస్తారని విమర్శించారు. జర్నలిస్ట్‌ జుబేర్‌ను, తీస్తా సీతల్వాడ్‌్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. వారి అరెస్ట్‌లను యావత్‌ దేశం ఖండిస్తుందని మమతా బెనర్జీ అన్నారు. కాగా నాలుగేళ్ల క్రితం చేసిన ట్వీట్‌ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా ఉందనే ఆరోపణతో జర్నలిస్ట్‌ మహ్మద్‌ జుబేర్‌ను దిల్లీ పోలీసులు పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే జుబేర్‌ అరెస్ట్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా అతని అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img