Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

విపక్షాల ఐక్యతకు అగ్నిపరీక్ష

టీఎంసీ సమావేశానికి కీలక నేతలు డుమ్మా
టీఆర్‌ఎస్‌, ఆప్‌, అకాలీదళ్‌, బీజేడీ, వైఎస్‌ఆర్‌సీ గైర్హాజరు
కాంగ్రెస్‌ రావడమే కారణమంటూ ప్రకటనలు

న్యూదిల్లీ : కేంద్రంలోని ఎన్డీయే కూటమిని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గద్దెదించే లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలకు ప్రాముఖ్యత నెలకొంది. అయితే ప్రత్యామ్నాయ కూటమికి అధినేతగా ఉండాలన్న ఆశ ప్రాంతీయ పార్టీల అధినేతల్లో ఉంది. తమ మధ్య విభేదాలను పక్కకు పెట్టి ఐక్యంగా ముందుకు సాగడానికి కొన్ని పార్టీల నేతలు సిద్ధంగా లేరని తాజా విపక్షాల సమావేశం ద్వారా స్పష్టమైంది. రాబోయే ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీల ఐక్యతకు ఈ సమావేశం ఓ పరీక్ష వంటిది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ గాంధీని ఈడీ విచారించడానికి వ్యతిరేకంగా తెలిపే నిరసనల క్రమంలో తమ బలాన్ని ప్రదర్శించే పనిని కాంగ్రెస్‌ పార్టీ చేస్తోంది. రాజకీయ శత్రుత్వం ఉన్నాగానీ దానిని పక్కకు పెట్టి సమావేశానికి హాజరైంది. వామపక్ష పార్టీలు సైతం పాల్గొన్నాయి.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీపై గుర్రుగా ఉన్న పార్టీలు మాత్రం రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల సమావేశానికి హాజరు కాలేదు. ఆహ్వానాన్ని ముందుగా తిరస్కరించిన నేతల్లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఉన్నారు. బీజేపీని ఓడిరచాలనే ఐక్య లక్ష్యంతో మమతా బెనర్జీతో మంచి సంబంధాలు పెట్టుకున్నా కానీ కాంగ్రెస్‌ను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి వేదికను పంచుకునే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్‌ తేల్చిచెప్పింది. తాము అభ్యంతరం వ్యక్తం చేసినా కాంగ్రెస్‌ను ఆహ్వానించారని మండిపడిరది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. తెలంగాణలో కాంగ్రెస్‌ `బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించింది. ఇటీవలి ఉప ఎన్నికలను ప్రస్తావించింది. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం పద్ధతిపైనా టీఆర్‌ఎస్‌కు అభ్యంతరాలు ఉన్నాయి. అభ్యర్థిని ఎంపిక చేసేశారు.. అభ్యర్థి అభిప్రాయాలూ తీసుకున్నారు. ఇక సమావేశం ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. చాలా మంది కీలక నేతలు ఈ సమావేశానికి దూరంగానే ఉండనున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశానికి హాజరు కాలేమని అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా ప్రకటించింది. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత దీనిపై నిర్ణయిస్తామని పేర్కొంది. బీజూ జనతా దళ్‌ (బీజేడీ) గైర్హాజరైంది. ఆహ్వానమే అందలేదని ఒక వేళ అందినా కాంగ్రెస్‌ వస్తోంది కాబట్టి మేము వెళ్లవాళ్లం కాదు అని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు. కాంగ్రెస్‌ కారణంగానే రావడం లేదని శిరోమణి అకాలీ దళ్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ హాజరు కాలేదు. హాజరైన వారిలో మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ, జనతాదళ్‌ (ఎస్‌) నేత కుమారస్వామి, రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేత జయంత్‌ చౌదరి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ, డీఎంకే తరపున టార్‌ బాలు, శివసేన తరపున శుభాష్‌ దేశాయ్‌తో పాటు ఎస్పీ, ఎన్సీ నేతలు ఉన్నటు ్లతెలిసింది.
కాగా, రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరుగుతాయి. ఫలితాలు 21వ తేదీన వెలువడతాయి. ఇదే క్రమంలో విపక్షాల తరపు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయమై మమతా బెనర్జీ మొత్తం 22 రాజకీయ పార్టీలను దిల్లీలో సమావేశానికి ఆహ్వానించారు. ఇదే విషయమై ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దీంతో ఆయననే రాష్ట్రపతి అభ్యర్థిగా అన్న ఊహాగానాలు వినిపించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img