భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా రోజూవారి కొత్త కేసులు వెయ్యి లోపే నమోదవుతున్నాయి. తాజాగా కొత్తగా 800 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 1,35,873 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 865 కొత్త కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,84,923కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,092 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,44,013 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,818కి ఎగబాకింది.ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రివకరీ రేటు 98.79 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల ( 220,66,95,872) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.