Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

వేతనాల పెంపు నిలిపివేయడం లేదు..మూడ్నెల్లకోసారి ప్రమోషన్‌

స్పష్టత ఇచ్చిన విప్రో
సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేయాల్సిన ఉద్యోగుల జీతాల పెంపును తాము నిలిపివేయడం లేదని ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. అంతేకాదు, మిడ్‌ మేనేజ్‌ మెంట్‌ స్థాయిలో మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులకు మూడు నెలలకోసారి ప్రమోషన్లు ఇచ్చే విధానాన్ని కొనసాగిస్తున్నామని విప్రో పేర్కొంది. విప్రో తమ ఉద్యోగుల వేతనాల్లో భాగమైన వేరియబుల్‌ పేను నిలిపివేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై విప్రో వర్గాలు స్పందించాయి. జులై మాసం నుంచి ప్రమోషన్లు క్రమంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే తొలి దశ ప్రమోషన్లు పూర్తయ్యాయని తెలిపింది. అయితే, మూడ్నెల్లకోసారి చెల్లించే వేరియబుల్‌ పేపై ఇప్పుడేమీ ప్రకటన చేయలేమని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img