Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు చనిపోయారని, వారు లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులుని అధికారులు తెలిపారు. వారిలో ఒకరిని అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్‌గామ్‌కు చెందిన ఆదిల్‌ హుస్సెయిన్‌ గా గుర్తించామన్నారు. అతడు 2018 నుంచి పాకిస్థాన్‌లో ఉంటున్నాడని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img