Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

సభ్యుల ప్రశ్నలకు సభలోనే సమాధానం చెప్పాలి : ఓమ్‌ బిర్లా

న్యూదిల్లీ : సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సభలోనే సమాధానం చెప్పాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సోమవారం పేర్కొన్నారు. ముద్ర రుణాల లబ్దిదారుల వివరాలను తాను సేకరించి సమాధానం చెబుతానని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవతి కిషన్‌రావ్‌ కరాద్‌ పేర్కొన్న నేపధ్యంలో స్పీకర్‌ ఓం బిర్లా వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం విన్న స్పీకర్‌ మాట్లాడుతూ ‘మీరు సమాచారం సేకరించి ఆయనకు ఇచ్చేటప్పుడు ఈ సభ ఎందుకు ఉంది’ అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి ముద్రా పథకంలో రెండోసారి రుణాల కోసం ఎంతమంది దరఖాస్తు చేసున్నారో తెలిపాలని భిల్వారాకు చెందిన బీజేపీ ఎంపీ సుభాశ్‌ చంద్ర భహారియా కోరారు. ‘మొదటి ముద్ర రుణాన్ని శిశు అంటారని, రెండోదాన్ని కిశోర్‌, మూడోదాన్ని తరుణ్‌ అంటారని, సమాచారం తెలుసుకుని, దాన్ని ఆయనతో పంచుకుంటా’ అని మంత్రి వ్యాఖ్యానించిన అనంతరం ఓం బిర్లా పై విధంగా స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img