కేరళ సీఎం పినరయ్ విజయన్
తిరువనంతపురం : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలోనూ నిరాటంకంగా విద్యావ్యవస్థ కొనసాగడానికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమిష్టిగా కృషి చేశారని కేరళ సీఎం పినరయ్ విజయన్ అన్నారు. విద్యపై కరోనా ప్రభావంపై ఇటీవల యునెసెఫ్ సంస్థ ఇండియా కేస్ స్టడీ పేరుతో నిర్వహించిన సర్వేలో కేరళ విధానాలను అభినందిస్తూ రూపొందించిన నివేదికలోని అంశాలను బుధవారం వరుస ట్వీట్‌ల ద్వారా పంచుకున్నారు. రాష్ట్రంలో సాగుతున్న విద్యావ్యవస్థ తీరుతెన్నులపై ఆ సర్వే సారాంశాన్ని ప్రస్తావిస్తూ ఇది అందరి సమిష్టి కృషి ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు. దాదాపు 70 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ద్వారానే పురోగతి ఉంటుందని నమ్ముతున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం, విద్యార్థులకు మద్దతుగా నిలిచే రాష్ట్రంగా కేరళ నిలుస్తోందని యునెసెఫ్ నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు. కరోనా ఉదృతిలోనూ ప్రతి విద్యార్థికి ఈ `లర్నింగ్ అవకాశాలను ప్రభుత్వమే సమకూర్చిన విషయాన్ని ఆ నివేదికలో పొందుపర్చినట్టు తెలిపారు. విపత్కర పరిస్థితిలోనూ ఎటువంటి అవాంతరాలు లేకు