Friday, December 2, 2022
Friday, December 2, 2022

సల్మాన్‌ ఖాన్‌కు వైప్లస్‌ సెక్యూరిటీ : బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపులతో భద్రత పెంపు

గ్యాంగ్‌ స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ హిట్‌ లిస్టులో ఉన్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌. సల్మాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులు ఆయన ఫామ్‌ హౌస్‌ వద్ద మాటు వేశారనే సమాచారంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ముప్పు పొంచి ఉందనే అనుమానంతో సల్మాన్‌ ఖాన్‌ భద్రతను వైప్లస్‌కు పెంచారు. కాగా భద్రత పెంపుతో సల్మాన్‌ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు ఉంటారు. మరోవైపు సల్మాన్‌ ఇంటి వద్ద రోజంతా ఇద్దరు గార్డులు పహారా కాస్తారు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి హెచ్చరికలు రావడంతో ముంబై పోలీసులకు చెందిన ప్రొటెక్షన్‌ బ్రాంచ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు భద్రత పెంచాలని నిర్ణయించింది. సల్మాన్‌ భద్రత విధుల్లో ఇప్పటి వరకూ ఒక సాయుధ గార్డు పనిచేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల ముంబై పోలీస్‌ కమిషనర్‌ను కలిసిన అనంతరం ఆయన దరఖాస్తును పరిశీలించిన పోలీసులు ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌కు పర్సనల్‌ వెపన్‌ లైసెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img