Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సాక్ష్యం లేకుండా చర్యలు కుదరదు

లఖింపూర్‌ ఘటనపై సీఎం యోగి
లక్నో : ‘ఎవరికీ అన్యాయం జరగదు. ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోలేం’ అని లఖింపూర్‌ హింసపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెప్పుకొచ్చారు. లఖింపూర్‌ హింస కేసులో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తనయుడిని తక్షణమే అరెస్టు చేయాలని ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో సీఎం యోగి పైవిధంగా స్పందించారు. అన్నదాతల మరణం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఘటనపై ప్రభుత్వం సవివరమైన దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రతి ఒక్కరికీ ఎక్కడైతే రక్షణ హామీ లభిస్తుందో…ఎవరి చేయి పట్టుకోవాల్సిన అవసరంలేదని సీఎం యోగి చెప్పారు. కేంద్రమంత్రి కుమారుడిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను మీడియా మిత్రులు ప్రస్తావించగా దీనికి ఆధారాలేవీ లేవన్నారు. వీడియోలు లేవన్నారు. తాము కొన్ని నంబర్లు ఇచ్చామని, ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే తమకు పంపాలని సీఎం యోగి అన్నారు. అంతా బహిర్గతమేనని, ఎవరికీ అన్యాయం జరగదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ఎవరినీ సహించేది లేదని చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఎవరి ఒత్తిడి వల్లో చర్యలు తీసుకోలేమని తెలిపారు. అరోపణలపై ఎవరినీ అరెస్టు చేయలేమని, అదేసమయంలో నేరానికి పాల్పడిన వారిని ఎంత పెద్దవారైనా వదిలేది లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img