Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

సామూహిక అత్యాచార ఘటన దురదృష్టకరం

కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై
మైసూరులో గ్యాంగ్‌రేప్‌కు గురైన యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెతో ఉన్న ఫ్రెండ్‌ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.మైసూరులోని చాముండీ హిల్స్‌ వద్ద ఆరుగురు యువకులు ఆ యువతిని రేప్‌ చేశారు. కర్నాటక ఏడీజీపీ ప్రతాప్‌ రెడ్డి ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నారు. గ్యాంగ్‌ రేప్‌ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. సామూహిక హత్యాచారానికి గురైన ఆ యువతిని హాస్పిటల్‌లో చేర్పించినట్లు చెప్పారు. గ్యాంగ్‌ రేప్‌ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగా జననేంద్ర కూడా స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. తాను ఇవాళ మైసూరు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.మంగళవారం రాత్రి 7 గంటలకు చాముండి హిల్స్‌ వద్ద అత్యాచార ఘటన జరిగింది. తాగిన మత్తులో వచ్చిన ఆరుగురు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img