Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

సార్వత్రిక ఎన్నికల్లో సమిష్టిగా పోరాడుతాం : మమతా బెనర్జీ

విపక్షాలు ఐక్యంగా ఉన్నాయని ఎన్నికల్లో తామంతా కలిసి పోరాడతామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షం ఐక్యంగా పోరాడుతుందని స్పష్టంచేశారు. . నితీష్‌ కుమార్‌, హేమంత్‌ సొరెన్‌, ఇతర నేతలతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు. రాజకీయం అంటేనే యుద్ధరంగమని తాము 34 ఏండ్లుగా పోరాడుతున్నామని దీదీ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల్లో విభేదాలను మీడియా గోరంతను కొండంతలుగా చూపుతుందని ఆరోపించారు. గతంలో తనకు అభిషేక్‌ బెనర్జీ మధ్య విభేదాలున్నాయని చూపారని, ఇలాంటి కధనాలతో టీఆర్పీ పెరగదని ఆమె హితవు పలికారు. పశువుల స్మగ్లింగ్‌ కేసులో టీఎంసీ నేత అనుబ్రత మొండల్‌ అరెస్ట్‌ను ప్రస్తావిస్తూ అనుబ్రత మొండల్‌ సాహసిగా జైలు నుంచి తిరిగివస్తారని అన్నారు. బడా నేతలను అరెస్ట్‌ చేస్తే కార్యకర్తలు నిస్ప్రహకు లోనవుతారని వారనుకుంటున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img