Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

సీఎంగా ఉంటానో.. లేదో ..నేటితో తేలిపోతుంది..!

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడతా
మరో 15ఏళ్లు పార్టీలోనే ఉంటా : యడియూరప్ప

బెళగావి : కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే నేటితో ప్రస్తుత సీఎం బీఎస్‌ యడియూరప్పకు రాంరాం చెబుతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. రాష్ట్రానికి పక్కా హిందూత్వవాదిని కొత్త సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసిందన్న వార్తలు వినవస్తున్నాయి. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం ఆధారంగా తన భవితవ్యం సోమవారంతో తేలుతుందని యడియూరప్ప ఆదివారం వెల్లడిరచారు. అయితే వచ్చే 10`15 ఏళ్లు బీజేపీలోనే ఉంటానని, ఆ పార్టీ కోసం పనిచేస్తానని 78ఏళ్ల లింయాగత్‌ నేత చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలా లేక తప్పుకోవాలా అన్నదానిపై పార్టీ అధిష్ఠానం నుంచి తనకు ఇంకా ఆదేశాలు అందలేదని, రాత్రికి లేదా సోమవారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. రెండు నెలల కిందటే పదవికి రాజీనామా చేస్తానని చెప్పానన్న ఆయన అధిష్ఠానం కోరితే సీఎంగా కొనసాగుతాయని, వద్దంటే తప్పుకుంటానని, పార్టీకి నిబద్ధగల కార్యకర్తగా ఉంటానని అన్నారు. అధిష్ఠానం నుంచి తనకు వ్యతిరేకంగా సందేశం వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు అప్పుడు ఆలోచిస్తా అంటూ యడియూరప్ప బదులిచ్చారు. అంతకుముందు బెళగావిలో విలేకరులతో మాట్లాడిన ఆయన అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడతానన్నారు. కర్ణాటక బీజేపీ మరెవ్వరికీ దక్కనన్ని పదవులు నన్ను వరించాయి. అందుకు ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్‌షాకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాకి కృతజ్ఞుడనని యడియూరప్ప చెప్పారు. కర్ణాటకలో బీజేపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు రెండేళ్లుగా కష్టపడ్డానని గుర్తుచేస్తూ 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు యడియూరప్ప నాయకత్వానికి ఢోకా లేదన్నట్లుగా సంకేతాలను జేడీ నడ్డా ఇచ్చారు. యడియూరప్ప బాగా పనిచేశారని మెచ్చుకున్నారు. కర్ణాటకలో పార్టీ సంక్షోభంలో లేదన్నారు. నూతన ముఖ్యమంత్రిగా సంతోష్‌?
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బ్రాహ్మణ వర్గానికి చెందిన బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. సంతోష్‌ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. కేంద్ర కేబినేట్‌ విస్తరణ సమయంలో శక్తిమంత నేతగా ఎదిగారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలో దాదాపు దశాబ్ద అనుబంధం ఆయనను కీలక నేతల స్థాయికి తీసుకెళ్లిందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. సంతోష్‌ కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. దానవగెరేలో ఇంజినీరింగ్‌ చదివారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన ఆయన యడియూరప్ప స్వస్థలమైన శివమొగ్గలో సేవలందించారు.
కేంద్రమంత్రి అనంతకుమార్‌తో ఈయనకు సాన్నిహిత్యం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ఎలాంటి పరిస్థితులోనూ ఆ భావజాలాన్ని వీడరని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తెరవెనుక నుంచి పరిస్థితులను, సంక్షోభాలను నియంత్రించడాన్ని సంతోష్‌ మొగ్గుచూపుతారని తెలిపాయి. కర్ణాటక బీజేపీ ఇంఛార్జీగా ఉండి అనేక సమస్యలను ఆయన పరిష్కారన్నాయి. అయితే పార్టీ పనితీరు విషయంతో సంతోష్‌కు యడియూరప్పకు విభేదాలు ఉన్నప్పటికీ తన పేరు ఎప్పుడూ వివాదాల్లో రాకుండా ఆయన జాగ్రత్తపడ్డారన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img