Monday, October 3, 2022
Monday, October 3, 2022

సీఎంగా నితీశ్‌ కుమార్‌.. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్‌ ప్రమాణం

బీహార్‌లో బుధవారం మధ్యాహ్నం కొత్త సర్కారు కొలువుదీరింది. బీహార్‌ 8వ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌లతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్‌కు డిప్యూటీ సీఎంగా తేజస్వీ పదవీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి. గతంలో నితీశ్‌ కేబినెట్‌లోనే డిప్యూటీ సీఎంగా కొనసాగిన తేజస్వి.. జేడీయూతో విభేదాల కారణంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఆయన రాజీనామా చేశారు. మొన్నటిదాకా బీహార్‌ సీఎంగా కొనసాగిన నితీశ్‌.. తాజాగా బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి, మహాఘట్‌ బంధన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం గవర్నర్‌ ఫాగు చౌహాన్‌కు తన రాజీనామాను సమర్పించిన నితీశ్‌.. తనకు మద్దతుగా నిలిచిన 164 మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా అందజేశారు. బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 7 పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే… తమకు మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల సభ్యులకు కూడా నితీశ్‌ తన కేబినెట్‌లో మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img