ఇక రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ టీకామందు కూడా సీరం ఇన్స్టిట్యూట్‌లో తయారు కానుంది. ఈ టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్టు సీరం సంస్థతో బాటు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, సావరిన్ వెల్త్ ఫండ్ ప్రకటించాయి. ఏడాదికి 300 మిలియన్ డోసులకు పైగా దీన్ని ఉత్పత్తి చేయాలన్నది తమ లక్ష్యమని వెల్లడిరచాయి. రష్యాలోని గమలేయా సెంటర్ నుంచి ఈ టీకా తయారీకి అవసరమైన సెల్,వెక్టార్ శాంపిల్స్ ఇప్పటికే సీరం సంస్థకి అందాయి. వీటి దిగుమతిని డీజీసీఐ కూడా అనుమతించింది.సీరం సంస్థతో కలిసి పని చేయడం తమకు సంతోషంగా ఉందని ఈ ఫండ్ సీఈవో క్రిల్ దిమిత్రియేవ్ తెలిపారు. రానున్న నెలల్లో సంయుక్తంగా తొలి బ్యాచ్ టీకామందు ఉత్పత్తి అవుతుందని ఆశిస్తున్నామని అన్నారు.సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా కూడా ఆయనతో ఏకీభవిస్తూ..మరికొన్ని నెలల్లో తమ రెండు సంస్థలూ కోట్ల డోసుల వ్యాక్సిన్ ని తయారు చేస్తాయని ఆయన వెల్లడిరచారు.కాగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లను తటస్థీకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజా ఓ అధ్యయనం వెల్లడిరచింది.