Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. ఆంక్షలు అమలు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. రోజూవారీ పాజిటివ్‌ కేసుల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం (ూబజూతీవఎవ జశీబత్‌ీ ) లో కరోనా కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. పలువురు లాయర్లు, న్యాయవాదులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో సుప్రీంకోర్టు, పరిసరాల్లో కరోనా ఆంక్షలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 7,178 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇక మహమ్మారి కారణంగా 24గంటల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 65,683 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొవిడ్‌ కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 (శదీదీ.1.16) వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు తెలిపారు. అయితే, కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఈ వేరియంట్‌ మరీ అంత శక్తిమంతమైనది ఏమీ కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img