Friday, June 9, 2023
Friday, June 9, 2023

సెక్యూరిటీ లేకుండా అర్ధరాత్రి వేళ ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణం

ఇటీవల కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుడ్ డెలివరీ బాయ్ బైక్‌పై ప్రయాణించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ట్రక్కులోప్రయాణించారు. అదీ అర్ధరాత్రి వేళ.. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లి పెద్ద సాహసమే చేశారు. సోమవారం రాత్రి హరియాణాలోని అంబాలా నుంచి చండీగఢ్‌ వరకూ 50 కిలోమీటర్ల దూరం ట్రక్కులోనే వెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా ట్రక్కు డ్రైవర్లతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి సిమ్లాలో ఉన్న తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీలను కలవడానికి ఢిల్లీ నుంచి రాహుల్ బయలుదేరారు.మార్గ మధ్యలో అంబాలా వద్ద ట్రక్కులు నిలిపి ఉన్న చోట రాహుల్ తన వాహనం ఆపి.. అక్కడ డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారిలో ఒకరి ట్రక్కు ఎక్కి చండీగఢ్‌ వరకూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి రాహుల్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడంతో పోలీసులు ఓ అనుమానితుడిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ సెక్యూరిటీ లేకుండా ధైర్యంగా లారీలో ప్ర‌యాణించ‌డంతో ఆయన తెగువను అంద‌రూ మెచ్చుకుంటున్నారు.రాహుల్ గాంధీ ట్రక్ ప్రయాణం గురించి.. హరియాణాకు చెందిన కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. తన తల్లి సోనియా గాంధీని కలిసేందుకు రాహుల్ సిమ్లాకు వచ్చారని చెప్పారు. ప్ర‌స్తుతం సోనియా సిమ్లాలోని ప్రియాంక గాంధీ ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. సిమ్లాలోనే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నిర్ణయం కూడా తీసుకున్నార‌నే కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథ్‌ రాహుల్ వీడియోను షేర్ చేస్తూ.. ారాహుల్‌ గాంధీ అర్థరాత్రి ట్రక్కు డ్రైవర్లను ఎందుకు కలిశారు? ఎందుకంటే ఆయ‌న‌ ఈ దేశ ప్రజల క‌ష్టాల‌ను వినాలనుకుంటున్నారు.. వారి సవాళ్లు, సమస్యలను అర్థం చేసుకోవాలనుకుంటున్నారు.. ఇలా చేయడం చూస్తుంటే ఒక నమ్మకం క‌లుగుతుంది. నెమ్మదిగా ఈ దేశం రాహుల్ గాంధీతో కదులుతోందని్ణ ఆమె అన్నారు.కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ట్వీట్ చేస్తూ… ాట్రక్కులు నడిపే డ్రైవర్ల సమస్యలను తెలుసుకోడానికి ఒకటో నెంబరు జాతీయ రహదారిపై ట్రక్‌లో ప్రయాణించడం రాహుల్ గాంధీకి మాత్రమే సాధ్యం్ణ అని అన్నారు. ఈ సమయంలో రాహుల్‌కు డ్రైవర్ల నుంచి భారీ మద్దతు లభించిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img