Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ అమలు చేయాలి

రక్షణ మంత్రిత్వ శాఖకు మహిళా సైనికాధికారుల నోటీస్‌
సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ అమలు చేయాలంటూ భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్‌ నోటీసు పంపారు. సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ అమలు చేయాలని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు.మహిళా అధికారుల తరఫు న్యాయవాది మేజర్‌ సుధాంశు పాండే మంత్రిత్వశాఖకు నోటీసు పంపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని కోరినట్లు నోటీసులో పేర్కొన్నట్లు తెలిపారు. రక్షణ కార్యదర్శి, డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌తో సహా అధికారులకు నోటీసులు పంపినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img