Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

సోనాలి పోస్టుమార్టంలో నిజాలు వెలుగులోకి.. సన్నిహితులే హంతకులు!

టిక్‌ టాక్‌ స్టార్‌, హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫొగట్‌ గోవాలో గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆమె హార్ట్‌ఎటాక్‌తో చనిపోలేదు.. హత్య అని గోవా మెడికల్‌ కాలేజీ డాక్టర్ల ప్యానెల్‌ నిర్వహించిన పోస్టుమార్టంలో వెల్లడైంది. ఆమెతోపాటు గోవా వచ్చిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు మర్డర్‌ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టంలో ఆమె శరీరంపై కమిలిన గాయాలను గుర్తించారు. సోనాలి మంగళవారం ఉదయం చనిపోగా.. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫొగట్‌ పీఏ సుధీర్‌ సాంగ్వాన్‌, ఆమె స్నేహితుడు సుఖ్‌విందర్‌లపై హత్య కేసు నమోదు చేశామని అంజునా పీఐ ప్రశాల్‌ దేశాయ్‌ వెల్లడిరచారు. వీరిద్దరి అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారని డీజీపీ జస్పాల్‌ సింగ్‌ తెలిపారు.సోనాలి చనిపోవడానికి ఆరు గంటల ముందు ఆమె శరీరంపై గాయాలై ఉంటాయని ఫోరెన్సిక్‌ నిపుణులు వెల్లడిరచారు. పిడిగుద్దులు గుద్దడం వల్ల లేదంటే కింద పడటం వల్ల ఈ గాయాలై ఉంటాయని భావిస్తున్నట్లు ఫోరెన్సిక్‌ అధికారులు తెలిపారు. సోనాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. వారు హర్యానా తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img