Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

సోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు గురువారం పోలీసులు తెలిపారు. సోపియాన్‌లోని జైన్‌పొరా ప్రాంతంలోని బదిగంలో తీవ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని పేర్కొన్నారు. ఈ గాలింపు చర్యల్లో తీవ్రవాదులు భదత్రా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు ప్రారంభించడంతో అదికాస్తా ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. ప్రస్తుతం పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img