Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

స్వస్థలానికి స్క్వాడ్రన్‌ లీడర్‌ కుల్దీప్‌ సింగ్‌ భౌతికకాయం

రaణరaున్‌(రాజస్థాన్‌) : తమిళనాడులో బుధవారం జరిగిన విషాదకర హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన రాజస్థాన్‌కు చెందిన ఐఏఎఫ్‌ అధికారి స్క్వాడ్రన్‌ లీడర్‌ కుల్దీప్‌ సింగ్‌ భౌతికకాయం శనివారం విమానంలో రaుణరaున్‌ ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకుంది. అక్కడ కుల్దీప్‌ సింగ్‌ భౌతికకాయానికి ఎంపీ నరేంద్ర కుమార్‌, ఎమ్మెల్యే రీటా చౌదరి, జిల్లా కలెక్టర్‌ యు.డి.ఖాన్‌, ఎస్‌పీ ప్రదీప్‌ మోహన్‌ శర్మ పుష్పగుచ్ఛాలతో నివాళి అర్పించారు. కుల్దీప్‌ సింగ్‌ సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. పుష్పాలతో అలకరించిన ఐఏఎఫ్‌కు చెందిన ఒక ట్రక్కులో సింగ్‌ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన ఘర్దానా ఖుర్ద్‌కు తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సింగ్‌కు నివాళులర్పించేందుకు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి ఆయన గ్రామం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు బారులుదీరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img