Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో అపశృతి

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లల్లో అపశృతి చోటుచేసుకుంది. చారిత్రక నేపథ్యం ఉన్న మహారాజా బడా తపాలా కార్యాలయం (పోస్టాఫీస్‌) భవనంపై జెండా ఏర్పాటు చేస్తున్న క్రమంలో గ్వాలియర్‌ నగర కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హైడ్రాలిక్‌ ఫైర్‌ బ్రిగేడ్‌ ట్రాలీలో కూర్చుని పోస్ట్‌ ఆఫీస్‌ భవనంపై జెండాలను ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తుండగా క్రేన్‌ ప్లాట్‌ ఫాం విరిగిపడిరది.దీంతో ముగ్గురు ఉద్యోగులు కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరిదీ నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. జాతీయ పండుగ ఏర్పాట్లలో విషాదం అలుముకోవడంపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img