Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

న్యాయస్థానాలు, తీర్పులపై విమర్శలు..: సీజేఐ యు యు లలిత్‌

కోర్టుల్లో వెలువరించే తీర్పులు, జడ్జిలపై ఈ మధ్యకాలంలో విమర్శలు వస్తున్నాయని.. సమాజానికి ఇదంత మంచిది కాదని సీజేఐ యు యు లలిత్‌ అన్నారు.తాము అంతిమంగా ప్రజా సేవకులమేనని, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే చేస్తామని స్పష్టం చేశారు. అయితే.. తాము ఇచ్చే తీర్పులు సమాజం ఆశించే విధంగా ఉన్నాయో లేదా చూసే హక్కు ప్రజలకు ఉందన్నారు. సద్విమర్శలు అయితే తాము కూడా స్వీకరిస్తామన్నారు.న్యాయ ప్రక్రియ వేగవంతమైనది, వేగవంతమైనదిగానే ఉండాల్సిన అవసరం ఉందన్నారు జస్టిస్‌ లలిత్‌. ఏదైనా న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం స్పష్టత, స్థిరత్వం అని చెప్పుకొచ్చారు. అయితే.. అస్థిరమైన అభిప్రాయాలు న్యాయవ్యవస్థ మొత్తానికి ఇబ్బందిగా మారుతుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెండిరగ్‌లో ఉన్న అన్ని సమస్యలను త్వరగా, సమర్థవంతంగా పరిష్కరించాలని, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం.. చట్టాన్ని రూపొందించడం సుప్రీంకోర్టు పని అని తెలిపారు. పెండిరగ్‌లో ఉన్న సమస్యలపై మనం ఎంత త్వరగా చేయగలిగితే, అది మంచిది అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగపరమైన అంశాలను వీలైనంత త్వరగా పరిశీలించేందుకు రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img