Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘అగ్నిపథ్‌’ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన సరికొత్త పథకం అగ్నిపథ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ అడ్వకేట్‌ శర్మ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.శర్మతో పాటు హర్ష్‌ అజయ్‌ సింగ్‌, రవీంద్ర సింగ్‌ షెకావత్‌ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ ఉదయం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చుతూ ఈ పిటీషన్లు వేశారు. పలు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. కేరళ, ఢల్లీి, పంజాబ్‌, హర్యానా, బిహార్‌, ఉత్తరాఖండ్‌లల్లో పిటీషన్లు విచారణ దశలో ఉన్నాయి. కోచిలోని ఆర్మ్డ్‌ ఫోర్స్‌ ట్రిబ్యునల్‌లోనూ పిటీషన్లు ఉన్నాయి. ఒకే అంశంపై వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ దశల్లో పిటీషన్లు విచారణలో ఉన్న సమయంలో దీన్ని విచారించడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిరది. తమ వద్ద ఉన్న పిటీషన్లను కూడా ఢల్లీి హైకోర్టుకు బదలాయించింది. తమ వద్ద మూడు రిట్‌ పిటీషన్లు విచారణకు వచ్చాయని, వాటిని ఢల్లీి హైకోర్టుకు బదలాయిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు ఈ విషయాన్ని వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img