Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అచ్యుతాపురంలో 30 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి

కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌
న్యూదిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ప్రతిపాదిత 30 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ఈఎస్‌ఐసీ సర్వసభ్య సమావేశం శనివారం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని అచ్యుతాపురంలో రెండు ఎకరాలు లేదా 8,089.07 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. ఈఎస్‌ఐసీ కోవిడ్‌19 సహాయ కార్యక్రమంలో కంట్రిబ్యూటరీ షరతుకు సమావేశం మినహాయింపు ఇచ్చింది. ఒడిశాలోని జర్సుగూడ వద్ద ఈఎస్‌ఐసీ సబ్‌ రీజనల్‌ ఆఫీసు(ఎస్‌ఆర్‌ఓ) ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఈఎస్‌ఐ పథకం అమలవుతోంది. ఈఎస్‌ఐసీ 186వ వార్షిక సమావేశం కేంద్ర కార్మికశాఖమంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. సమావేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్‌ కారణంగా మరణించిన రోగుల కుటుంబాలకు ఈఎస్‌ఐసీ కోవిడ్‌19 సహాయ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. 40 ఏళ్లు పైబడిన ఈఎస్‌ఐ సభ్యులకు హెల్త్‌ చెకప్‌ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అహ్మదాబాద్‌, ఫరీదాబాద్‌, హైదరాబాద్‌, కోల్‌కతా ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్టన్లు మంత్రి తెలిపారు. గురుగ్రావ్‌లో గల 100 పకడల ఆసుపత్రిని 500 పడకలకు పెంచడానికి సమావేశం ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమం కింద బీమా చేయించుకున్న సభ్యులకు ఉచితంగా వైద్య చెకప్‌ చేస్తామని మంత్రి విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img