Friday, April 19, 2024
Friday, April 19, 2024

అదనంగా 50 లక్షల టీకా డోసులు ఇవ్వండి

కేంద్రానికి తమిళనాడు విజ్ఞప్తి
చెన్నై : అక్టోబరు చివరి నాటికి అర్హులందరికీ టీకాలు వేసేందుకు, రెండవ డోసు వారికి ఇచ్చేందుకు ప్రతివారం అదనంగా 50 లక్షల కోవిడ్‌ టీకా డోసులను కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వం సోమవారం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. సెప్టెంబర్‌ 12, 19 తేదీలలో జరిగిన రెండు మెగా కోవిడ్‌ టీకా శిబిరాల ‘అద్భుతమైన విజయాన్ని’ ఉదహరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల టీకా డోసులను అందించినట్లు ఆయన వివరించారు. ‘కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 19, 2021 వరకు రాష్ట్రానికి 2.21 కోట్ల 0.5 ఎంఎల్‌ సిరంజిలను, 3.97 కోట్ల టీకా డోసులను సరఫరా చేసింది. ప్రతి 10 ఎంఎల్‌ వైల్‌లో ఎక్కువ మోతాదును తీసుకోవడం ద్వారా ప్రభుత్వ కోవిడ్‌ వాక్సినేషన్‌ కేంద్రాలలో 4.13 కోట్ల మందికి రాష్ట్రం టీకా డోసులను అందించగలిగింది. రాష్ట్రంలో టీకాల పంపిణీ లక్ష్య స్థాయి ఉన్నప్పటికీ, ఇంకా అర్హులయిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి టీకాలు అందించలేదు. ఇది కోవిడ్‌ కేసులు రాష్ట్రానికి హాని కలిగించేలా చేస్తుంది’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అదనంగా 50 లక్షల టీకా డోసులను అందించాలని అభ్యర్థిస్తున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img