Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అన్నిటికంటే ఎక్కువ డేటా సమీకరణలో గూగుల్‌ ముందంజ

అతి తక్కువ డేటా సేకరిస్తున్నది యాపిల్‌
యూజర్లకు సంబంధించి ఎక్కువ డేటాను సేకరిస్తున్నది గూగుల్‌ అని ఓ అధ్యయనం పేర్కొంది. స్టాక్‌ యాప్స్‌ డాట్‌ కామ్‌ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం గూగుల్‌ యూజర్లకు సంబంధించి 39 రకాల వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తుంటుంది. ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌ వేర్‌ రూపంలో ప్రపంచంలో సగానికి పైనే ఫోన్లలోకి గూగుల్‌ చేరిపోయింది. ఏ ఫోన్లో చూసినా గూగుల్‌ ఉండాల్సిందే. ఏది కావాలన్నా గూగుల్‌ లో శోధించాల్సిందే. సమాచార సేకరణకు గూగుల్‌ కు ఇదే వరంగా మారింది. కానీ, గూగుల్‌ మన సమాచారాన్ని ట్రాక్‌ చేస్తున్న సందర్భంలో అప్రమత్తం చేసే ఒక యాప్‌ త్వరలోనే రానుంది. బెర్ట్‌ హ్యుబర్ట్‌ అనే డెవలపర్‌ ఒక యాప్‌ ను అభివృద్ధి చేశాడు. కాకపోతే ఇది లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పైనే ప్రస్తుతం పనిచేస్తుందట. దీని పేరు గూగుల్‌ టెల్లర్‌. గూగుల్‌ సమాచారాన్ని సేకరిస్తున్న ప్రతి సారీ సౌండ్‌ రూపంలో సంకేతం ఇస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్‌, విండోస్‌ కు సపోర్ట్‌ చేసే విధంగా ఇది రావాలని కోరుకుందాం. ఇక అన్నింటిలోకి యాపిల్‌ ఒక్కటే యూజర్లకు సంబంధించి కావాల్సిన కనీస డేటాను మాత్రమే తీసుకుంటోందని స్టాక్‌ యాప్స్‌ డాట్‌ కామ్‌ అధ్యయనం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img