Friday, April 26, 2024
Friday, April 26, 2024

అన్నీ ఇప్పుడే చెబితే..తర్వాత ఏం చెప్పాలి?

ప్రధాని పదవిపై మమత స్పందన

పనాజీ : 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవి కోసం పోటీ చేయడంపై బంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఇప్పుడే చెబితే.. తర్వాత నేను ఏం చెప్పాలి?’ అని ఆమె వ్యాఖ్యానించారు. మూడు రోజుల గోవా పర్యటనలో ఉన్న మమత శుక్రవారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా?’ అని విలేకరులు ఆమెను ప్రశ్నించగా ‘2024 ఎన్నికల్లో మేం పోటీ చేస్తాం. మేము పారదర్శకంగా ఉంటాం. మా పార్టీ దాగుడు మూతల ఆటలు ఆడదు’ అని మమత సమాధానమిచ్చారు. ఇదే ప్రశ్నను మరో జర్నలిస్టు అడగగా… ‘మీరు ఎందుకు పీఎం పదవి కోసం పోటీ చేయరు? మీరు మీడియాలో ఉన్నారు. మీరు కూడా పోటీ చేయవచ్చు’ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అనూహ్య విజయం సాధించి.. మమత మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా దేశ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె.. గోవాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దేశ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు బీజేపీనే కేంద్రంగా ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించడంపై మమతను విలేకరులు ప్రశ్నించగా… ఈ ప్రశ్నను తనను అడిగే బదులు ఆయనను అడిగితేనే బాగుంటుందని ఆమె అన్నారు. ‘బహుశా ఆయన ఉద్దేశం.. టీఎంసీ సత్తా చాటకపోతే బీజేపీ నిలుస్తుందని కావచ్చు’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img