Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఇచ్చాం

అమిత్‌షా గొప్పలు
న్యూదిల్లీ : గడచిన ఏడేళ్లుగా అవినీతిరహిత ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్రమోదీ అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పుకొచ్చారు. మోదీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఏ ఒక్కరూ ప్రశ్నించే పరిస్థితి లేదని అన్నారు. అమిత్‌షా శుక్రవారం ఇక్కడ ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. దేశంలో 60 కోట్లమంది ప్రజలను అభివృద్ధి ప్రక్రియలోకి తీసుకురావడం మోదీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని అమిత్‌షా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని, 60 కోట్ల మంది అభివృద్ధిలో భాగస్వాములయ్యారని తెలిపారు. ‘దేశంలో కనీసం 60 కోట్లమందికి బ్యాంక్‌ ఖాతాలు లేవు. విద్యుత్‌ సరఫరా లేదు. గ్యాస్‌ కనెక్షన్లు లేదా వైద్య సదుపాయాలు లేవు. మోదీ సర్కారు వారందరికీ ఆ సదుపాయాలు కల్పించింది. దీంతో భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై వారికి నమ్మకం ఏర్పడిరది’ అని షా చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ఏకరువు పెట్టారు. గడచిన 50 ఏళ్లలో ఏ ప్రభుత్వమైనా నాలుగు లేదా ఐదు కీలక నిర్ణయాలు తీసుకుందని, కానీ మోదీ ప్రభుత్వం ఈ ఏడేళ్లలోనే 50 కీలక నిర్ణయాలు తీసుకుందని గొప్పలు చెప్పారు. 155 కోట్ల కరోనా టీకాలు వేశామని, ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని, తయారీరంగం, ఉత్పత్తి, ఎగుమతులు పెరుగుతున్నాయని అమిత్‌షా చెప్పారు. దేశ అభివృద్ధి ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిందిగా ఫిక్కీకి ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img