Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అసోం`మిజోరం మధ్య సరకు రవాణా బంద్‌

సిల్చార్‌/గౌహతి : అసోం`మిజోరం సరిహద్దు వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. వరుసగా ఆరో రోజు ఆదివారం కూడా రెండు రాష్ట్రాల మధ్య నిత్యావసర సరుకులను తీసుకెళ్లే ట్రక్కులు సహా వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాడమే ఇందుకు నిదర్శనం. కాగా హింసతో దద్దరిల్లిన లైలాపూర్‌, చుట్టు పక్కల, అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని, జాతీయ రహదారి-306 లో పెద్ద సంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌ దళాలు గస్తీ తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అసోం ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి జయంత మల్లా బరువా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం, హత్యకు గురైన ఒక అసోం పోలీసు సిబ్బంది ఇంటిని సందర్శించింది. సోమవారం జరిగిన హింసను అతడు చూపిన ధైర్య సాహసాలను ప్రశంసించింది. అసోంలోని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించడానికి ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు బరాక్‌ లోయలోని అధికారులు తెలిపారు. కోవిడ్‌-19 మెటీరి యల్స్‌ సహా అత్యవసరాలకు సంబంధించిన డజన్ల కొద్దీ ట్రక్కులు కచార్‌ జిల్లాలోని కాబూగంజ్‌-ధోలై మార్గంలో వేచి ఉన్నాయి. ‘‘మిజోరంకు వెళ్లే రహదారులపై వ్యవస్థీకృత దిగ్బంధం ఎత్తివేయబడిరది.. ఇప్పుడు ట్రక్కులు లేదా ఇతర వాహనాలను ఆపడానికి వీధుల్లోకి ఎవరూ రావడం లేదు కానీ బాధిత పౌరులు ఇప్పుడు వాహనాలను నిలిపివేస్తున్నారు. అలాగే ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనదారులు కూడా ధైర్యం చేసి తమ వాహనాలను ముందుకు నడిపించడానికి ప్రయత్నించడం లేదు’’ ‘అని ఒక అధికారి చెప్పారు. మిజోరం నుంచి కూడా వాహనాలు అసోంలోకి ప్రవేశించడం లేదని, అధికారులు, భద్రతాబలగాల వాహనాలు మాత్రమే రోడ్డుపై తిరుగుతున్నాయని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img