Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అసోంలోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ పేరు మార్పు

అసోంలోని రాజీవ్‌గాంధీ ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌ పేరును ఆ రాష్ట్ర సర్కార్‌ మార్చింది. రాజీవ్‌గాంధీ పేరును తొలగించి ఒరాంగ్‌ నేషనల్‌ పార్కుగా మార్చాలని ఆ రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది.రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ దేశంలోనే రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌కు పెట్టింది పేరు. జాతీయ పార్క్‌ పేరును మార్చాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ఆదివాసీ, టీ తెగ కమ్యూనిటీ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేబినెట్‌ రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ పేరును ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌గా మార్చాలని నిర్ణయించినట్లు ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img