Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అసోంలో అకాల వర్షాలు

8 మంది మృతి
గౌహతి : అసోంలో గత రెండు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, పిడుగు పాట్ల కారణంగా ఇద్దరు మైనర్లు సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్టు అసోం స్టేట్‌ డిజిస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటి శనివారం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడిరచింది. బోర్డోయిసిలా అనే తుఫాను గురువారం రాష్ట్రంలోకి ప్రవేశించిందని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధ్వంసం జరిగిందని తెలిపింది. గురువారం బార్‌పేట జిల్లాలో తుఫాను కారణంగా ముగ్గురు మృతి చెందినట్టు తెలిపింది. అదే రోజు గోల్‌పరా జిల్లాలో పిడుగుపాటు కారణంగా 15 ఏళ్ల బాలుడు ఒకరు చనిపోయినట్టు తెలిపింది. శుక్రవారం కూడా కొనసాగిన తుఫాను కారణంగా దిబూఘర్‌ జిల్లాలో నలుగురు వ్యక్తులు మృతి చెందారని, వీరిలో 12 ఏళ్ల బాలుడు ఉన్నట్టు తెలిపింది. రెండు రోజుల అకాల వర్షాలతో ప్రాణ నష్టంలో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 7,378 ఇళ్లు దెబ్బతిన్నాయని, అనేక విద్యుత్‌ స్తంబాలు నేలకొరిగాయని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img