Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన శరద్‌ పవార్‌

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అస్వస్థత కారణంగా ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్టు పార్టీ వర్గాలు సోమవారంనాడు తెలిపాయి. 81 ఏళ్ల పవార్‌ మరో మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నారు.నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అస్వస్థత కారణంగా ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్టు పార్టీ వర్గాలు సోమవారంనాడు తెలిపాయి. 81 ఏళ్ల పవార్‌ మరో మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నారు. పార్టీ ఆఫీసు బ్యారర్లు, కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రి వద్ద గుమిగూడవద్దని ఎన్‌సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జె పార్టీ అధికారిక లేఖలో కోరారు.షెడ్యూల్‌ ప్రకారం రాహుల్‌ గాంధీ సారథ్యంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో నవంబర్‌ 8న పవార్‌ పాల్గొనాల్సి ఉంది. నాందేడ్‌ గుండా మహారాష్ట్రలోకి ఈనెల 7న భారత్‌ జోడో యాత్ర అడుగుపెడుతోంది. భారత్‌ జోడో దేశవ్యాప్త యాత్రలో పాల్గొనాల్సిందిగా పార్టీ ఆహ్వానానికి పవార్‌ సమ్మతి తెలిపినట్టు మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటేలే ఇంతకుముందు ప్రకటించారు. శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాకరే) చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరేను కూడా ఆహ్వానించామని, ఆయన నుంచి ఇంకా సమాధానం రాలేదని చెప్పారు. 150 రోజుల భారత్‌ జోడో యాత్రలో భాగంగా బుల్దానాలోని నాందేడ్‌, షేగావ్‌లలో ర్యాలీలను ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగించనున్నారు. నిజాం పాలన నుంచి మరాట్వాడాకు విముక్తి లభించి 75 ఏళ్లు పూర్తయిన తరుణంలో భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలో అడుగుపెడుతుండటం విశేషమని, ఈ సందర్భాన్ని రాహుల్‌తో కలిసి నాందేడ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటామని పటోలే తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img