Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆరు నెలల్లో 200 నగరాలకు 5జీ : కేంద్ర మంత్రి

ప్రస్తుతం దేశమంతా 5జీ నెట్‌వర్క్‌ పైనే చర్చ నడుస్తోంది. అందరూ 5జీ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో 5జీ సేవలు విస్తృతంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడిరచారు. ఆరునెలల్లో దేశంలోని 200పైగా నగరాల్లో 5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిరచారు. తర్వాతి రెండు సంవత్సరాల్లో దేశంలో 80శాతం నుంచి 90శాతం ప్రాంతాల్లో 5జీ నెట్‌వర్క్‌ ఉంటుందని అంచనా వేశారు. 5జీ ధరలు కూడా దేశంలో అందుబాటు ధరల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా వచ్చే సంవత్సరం ఆగస్టు 15 కల్లా 5జీని తీసుకొస్తుందని అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటి వరకు దేశంలో 4జీని కూడా అందుబాటులోకి తీసుకురాలేదు.
5జీ రేస్‌లో ఎయిర్‌టెల్‌ ఫస్ట్‌.. నేటి నుంచి 8 నగరాల్లో 5జీ.. జియో కంటే ముందుగా..
మరికొన్ని రోజుల్లో 5జీ నెట్‌వర్క్‌ గురించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 8 నగరాల్లో 5జీ సర్వీస్‌ల రోల్‌అవుట్‌ను మొదలుపెట్టినట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. అయితే ముందుగా టెస్టింగ్‌ కోసం అందుబాటులోకి తీసుకురావొచ్చు. దీపావళిలోగా 5జీని ప్రధాన నగరాల్లో లాంచ్‌ చేస్తామని రిలయన్స్‌ జియో చెప్పింది. సంవత్సరంన్నర లోగా దేశమంతా విస్తరిస్తామని ప్రకటించింది. వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఇంకా 5జీ లాంచ్‌ గురించి స్పష్టతనివ్వలేదు. మరోవైపు 5జీ ప్లాన్స్‌ కూడా తొలినాళ్లలో 4జీ ప్లాన్స్‌ ధరను పోలే ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చౌకైన ధరలకే 5జీ ప్లాన్‌లను అందిస్తామని జియో ఇప్పటికే స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్‌ కూడా 4జీ ధరలకే 5జీ ప్లాన్స్‌ ఉంటాయని సంకేతాలు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img