Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆరోగ్యం కోసం యోగా ప్రపంచాన్ని ఏకం చేస్తోంది

ప్రధాని మోదీ
న్యూదిల్లీ : మంచి ఆరోగ్యం కోసం యోగా ప్రపంచాన్ని ఏకం చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అన్నారు. 114 దేశాల ప్రజల కోసం యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దోహాలోని భారత రాయబార కార్యాలయం గొప్ప ప్రయత్నాన్ని ఆయన ప్రశంసించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సాంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ‘ఆతిథ్య దేశం ఒప్పందం’పై సంతకం చేయడాన్ని కూడా మోదీ తన ట్వీట్‌లలో ప్రస్తావించారు. అటువంటి అత్యాధునిక కేంద్రానికి నిలయమవడం భారతదేశానికి గౌరవంగా ఉందని అన్నారు. ‘ఈ కేంద్రం ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తయారు చేయడానికి, ప్రపంచ ప్రయోజనాల కోసం మన గొప్ప సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించుకోవడానికి దోహదం చేస్తుంది’ అని ఆయన చెప్పారు. భారతదేశం నుండి సాంప్రదాయ ఔషధాలు, మంచి ఆరోగ్య పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయని, సమాజంలో ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్రం చాలా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక శాస్త్ర, సాంకేతికత ద్వారా సాంప్రదాయ ఔషధాల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రం స్థాపించడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకుముందు ట్వీట్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img