Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆరోగ్య ప్రమాణాల్లో కేరళ అత్యుత్తమం

ఉత్తర ప్రదేశ్‌ అధ్వాన్నం
నీతి ఆయోగ్‌ ఆరోగ్య సూచీ వెల్లడి

న్యూదిల్లీ : పెద్ద రాష్ట్రాలలో మొత్తం ఆరోగ్య పనితీరు విషయంలో కేరళ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఉత్తర ప్రదేశ్‌ అధ్వాన్న పనితీరును కనబరిచినట్లు నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నాల్గవ ఆరోగ్య సూచీ(హెల్త్‌ ఇండెక్స్‌) వెల్లడిరచింది. ఈ నాల్గవ దఫా ఆరోగ్య సూచీ 2019`20 కాలం(సూచన సంవత్సరం)ను పరిగణనలోకి తీసుకుంది. ఇక తమిళనాడు, తెలంగాణ వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా నిలిచాయని ప్రభుత్వ మేథోమధన సంస్థ నివేదిక పేర్కొంది. ఆరోగ్య ప్రమాణాల విషయంలో అధ్వాన్న పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా వరుసగా బీహార్‌, మధ్య ప్రదేశ్‌ రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. అయితే, బేస్‌ ఇయర్‌ (2018-19) నుంచి సూచన సంవత్సరం (2019-20) వరకు అత్యధిక పెరుగుతున్న మార్పును నమోదు చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్‌ పనితీరు పరంగా అగ్రస్థానంలో ఉందని వివరించింది. చిన్న రాష్ట్రాల విషయానికొస్తే, మిజోరం మొత్తం పనితీరుతోపాటు పెరుగుతున్న పనితీరు విషయంలోనూ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించింది. కేంద్ర పాలిత ప్రాంతాలయిన దిల్లీ, జమ్ము,కశ్మీర్‌ అట్టడుగున ఉన్నాయి. అయితే పనితీరు మెరుగుదలలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయని నివేదిక తెలిపింది. మొత్తం పనితీరు పరంగా కేరళ వరుసగా నాలుగో దఫా కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని పేర్కొంది. నివేదిక ప్రకారం, అత్యధిక రిఫరెన్స్‌ ఇయర్‌ (2019-20) ఇండెక్స్‌ స్కోర్‌లతో మొత్తం పనితీరు పరంగా కేరళ, తమిళనాడు మొదటి రెండు అత్యుత్తమ పనితీరు కనబరిచి రాష్ట్రాలుగా ఉన్నాయి. అయితే పెరుగుతున్న పనితీరు పరంగా వరుసగా 12, 8వ స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ మొత్తం పనితీరుతో పాటు పనితీరు మెరుగుదల రెండిరటిలోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రెండు సందర్భాల్లోనూ మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం పనితీరు, పనితీరు మెరుగుదల రెండిరటిలోనూ రాజస్థాన్‌ బలహీన ప్రదర్శన చూపిందని నివేదిక వెల్లడిరచింది. చిన్న రాష్ట్రాల విషయానికొస్తే, మిజోరాం, త్రిపురలు బలమైన మొత్తం పనితీరును నమోదు చేశాయి. అదే సమయంలో పెరుగుతున్న పనితీరులో మెరుగుదలను చూపించాయని వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img