Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆర్‌సీపీ సింగ్‌కి పాట్నా బంగ్లా హుళక్కే…!

ఖాళీ చేయాలని కోరిన బీహార్‌ ప్రభుత్వం
పాట్నా : కేంద్ర మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కొన్నేళ్లుగా తాను ఉంటున్న పాట్నాలోని విశాలమైన బంగ్లాను ఇప్పుడు వదులుకోవలసి వస్తుంది. ఏడాది క్రితం వరకు తాను సారధ్యం వహించిన జేడీ(యూ) ద్వారా మరోసారి రాజ్యసభ పదవి ఆయనకు నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా మంత్రి బంగ్లా 07, స్ట్రాండ్‌ రోడ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేటాయించనున్నట్లు ఈ వారం మొదట్లో భవన నిర్మాణ విభాగం జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌ పేర్కొంది. ‘బంగ్లాను ఆర్‌సీపీ సింగ్‌కు కేటాయించలేదు. ఆర్‌సీపీ నివసించడానికి అనుమతించిన జేడీ(యూ) ఎమ్మెల్సీ సంజయ్‌ గాంధీకి ఆ బంగ్లాను కేటాయించాం. ఇప్పుడు అదే రోడ్డులో గాంధీకి మరో బంగ్లా కేటాయించాం’ అని రాష్ట్ర భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్‌ చౌదరి తెలిపారు. ఇందులో రాజకీయ కోణం లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 07, సర్క్యులర్‌ రోడ్‌ నుంచి బంగ్లా కేటాయించామని, ఇంతకుముందు రాష్ట్ర అత్యున్నత అధికారి అందులో ఉన్నారని సీఎం నితీశ్‌కి సన్నిహితుల్లో ఒకరయిన జేడీ(యూ) నాయకుడు చౌదరి అన్నారు. ‘ముఖ్యమంత్రి అధికారిక నివాసం 01, అన్నే మార్గ్‌, 100 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. విస్తృత మరమ్మతులు జరుగుతున్నాయి. అందువల్ల ఆయన 07, సర్క్యులర్‌ రోడ్‌కి మారాడు. తగిన సమయంలో ఆయన ప్రస్తుత నివాసాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో భాగం చేయాలని, ప్రధాన కార్యదర్శికి కొత్త ఇంటిని కేటాయించాలని నిర్ణయించారు’ చౌదరి చెప్పారు. ఇదిలాఉండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఉక్కు మంత్రిత్వ శాఖను కలిగి ఉన్న ఆర్‌సీపీ సింగ్‌, రాజ్యసభ పదవీకాలం జులైలో ముగియడంతో ఆయన కేంద్ర మంత్రి పదవి ప్రమాదంలో పడిరది. 2010లో రాజకీయాల్లోకి ప్రవేశించిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఆర్‌సీపీ సింగ్‌ ముఖ్యమంత్రి నితీశ్‌తో కలిసి వివిధ హోదాల్లో పని చేసిన కొద్ది నెలల్లోనే కేంద్ర మంత్రి అయ్యారు. అయితే కేంద్ర మంత్రివర్గంలో సింగ్‌కు చోటు దక్కే అవకాశం ఉన్నప్పటికీ మరోసారి రాజ్యసభ పదవి నిరాకరణ, ఇప్పుడు బంగ్లాను ఖాళీ చేయాలనడం ఆర్‌సీపీ విధేయులను ఆశ్చర్యపరిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img