Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆ ఊరిలో సైరన్‌ మోగగానే ఫోన్లు బంద్‌!

కరోనా లాక్‌ డౌన్‌తో జీవన విధానం మారిపోయింది. స్కూల్స్‌, కాలేజీలు బంద్‌ కావడంతో ఆన్‌ లైన్‌ క్లాస్‌ల ద్వారా చదువు సాగింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా దీంతో పిల్లలు, పెద్దలు అంతా మొబైల్‌ ఫోన్స్‌, టీవీలకు బాగా అలవాటుపడిపోయారు. దీంతో ప్రస్తుతం స్కూల్స్‌, కాలేజీలు ప్రారంభమైన ఆ అలవాటును మానుకోలేని పరిస్ధితి నెలకొంది.ఈ నేపథ్యంలో ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరిని ఆలోచింపచేస్తోంది. రాత్రి 7గంటలకు ఆ గ్రామంలో సైరన్‌ మోగుతుంది. వెంటనే ప్రతీ ఇంట్లో టీవీలు, ఫోన్‌లు బంద్‌ అవుతాయి. పిల్లలు పుస్తకాలు పడతారు, మహిళలు వంటలు, ఇతర పనుల్లో నిమగ్నమవుతారు. ఆగస్టు 15 నుంచి ప్రతీరోజు గంటన్నర పాటు ఇదే పద్దతి. ఇది ఎక్కడునుకుంటున్నారా..మహారాష్ట్ర సంగ్లీ జిల్లా కాడేగావ్‌ మండలం మోహిత్యాంచె వడ్గావ్‌ గ్రామం. రాత్రి 7గంటల నుంచి 8.30 గంటల మధ్యలో టీవీలు, సెల్‌ ఫోన్లు పనిచేయవు. ఆ గ్రామ సర్పంచ్‌ విజయ్‌ మోహితే తీసుకున్న నిర్ణయంతో ఆ గ్రామం పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img