Friday, April 19, 2024
Friday, April 19, 2024

అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిది?

: దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా
తెలంగాణలో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ లోటస్‌ పేరుతో వికృత క్రీడ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆపరేషన్‌ లోటస్‌ బట్టబయలైందని, రూ.100 కోట్లతో ముగ్గురు దళారులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారని.. పట్టుబడిన ముగ్గురికి బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలను తీసుకువస్తే డబ్బులు, సెక్యూరిటీ, పదవులు ఇస్తామని ఆఫర్‌ చేశారని తెలిపారు.దిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని… ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా సిద్ధం అయ్యాయని ఆడియోలో చెప్పారని.. ఆడియోలో బీఎల్‌ సంతోష్‌, అమిత్‌ షా పేరు కూడా చెబుతున్నారని సిసోడియా ఆరోపించారు. అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని.. ఎవరిదని ప్రశ్నించారు. అమిత్‌షావా..? లేక బీఎల్‌ సంతోష్‌ డబ్బులా..? అని అడిగారు. దేశంలో ఇది తీవ్రమైన సమస్య అని అన్నారు. కేంద్రం హౌంశాఖ మంత్రిని తప్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img