Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆ బిల్లును రాష్ట్రపతికి పంపండి

గవర్నరుకు స్టాలిన్‌ విజ్ఞప్తి
చెన్నై : నీట్‌ పరిధి నుంచి రాష్ట్రాన్ని మినహాయిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపాల్సిందిగా గవర్నరు ఆర్‌ఎన్‌ రవికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా వైద్య కోర్సులో ప్రవేశాలు కల్పించేలా రాష్ట్రపతిని ఒప్పించాలని కోరారు. స్టాలిన్‌ రాజ్‌భవన్‌లో గవర్నరు రవిని కలిశారు. త్వరగా రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు బిల్లును ఆయనకు పంపాల్సిందిగా విన్నవించారు. స్టాలిన్‌ వెంట మంత్రులు దురైమురుగన్‌, మా సుబ్రమణియన్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. రవి, స్టాలిన్‌ మధ్య జరిగిన సమావేశం వివరాలను రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడిరచాయి. వర్షాలు, కోవిడ్‌కు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నీట్‌ను వ్యతిరేకించింది. నీట్‌ పరిధి నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం లభించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img